Pending
అగ్నిమాపక శాఖ- విధ్యుత్ శాఖ - రహదారుల శాఖ - వైధ్య శాఖ - అన్నీ శాఖల నిర్లక్షం - మరియు trauma care విభాగం లేమి
Description
మన చిత్తూరు నగర సమీపంలోని ఇరువారం పరిసర ప్రాంతంలో ని వేలూర్ బై పాస్ వద్ద ఒక కంటైనేర్ 11KV కరెంట్ లైన్ తగలడం తో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. కంటైనేర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనను కాస్త పరిశీలిస్తే 3 ప్రశ్నలు మదిలో మెదులుతాయి. 1. 11 KV కరెంట్ లైన్ ను తక్కువ ఎత్తులో కాకుండా ఎత్తులో ఏర్పాటు చేసి ఉంటె ఒక అమాయకుడి ప్రాణం పోయేది కాదు..అతని కుటుంబం రోడ్డున పడే వాళ్ళు కాదు. ఇది విద్యుత్ శాఖ నిర్లక్ష్యం అనాలా?? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు??? 2. విషయం తెల్సుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి వచ్చారు..కాసేపటికే నీళ్ళు అయిపోయాయి..మళ్ళి టాంకర్ ద్వార నీళ్ళు తెప్పించి, ఆ నీటిని ఫిల్ చేసి మళ్ళి యంత్రం ద్వారా మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు...అప్పటికే కంటైనేర్ మొత్తం కాలిపోయింది. ఇది చూస్తుంటే మన చిత్తూరు నగరం జిల్లా కేంద్రమేనా అని సందేహం వస్తోంది. జిల్లా కేంద్రం లోనే అగ్నిమాపక సిబ్బంది ఇంత నిర్లక్ష్యం గా ఉంటె గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి ఏంటి? లేదా చిత్తూరు నగరంలో ఏదైనా పెద్ద అగ్ని ప్రమాదం సంభవిస్తే "పరిస్థితి" ఏంటి?? 3. ఏదైనా ప్రమాదం జరిగినా జిల్లా కేంద్రం లో మంచి ఆసుపత్రి లేదు.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేసి వెలూరు కి రెఫర్ చేస్తారు....ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేకుండా చేసారు.. మొన్న మేయర్ దంపతుల పై జరిగిన హత్య ప్రయత్నం లో మేయర్ గారి భర్త అయిన కటారి మోహన్ గారిని కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి పంపించేసారు...మంచి ఆసుపత్రి ఉంటె ఆయన బ్రతికేవారేమో ??? వీటన్నింటిని చుస్తే మొత్తం వ్యవస్థ చిత్తూరులో నిద్రావస్తలో ఉన్నారని తెలుస్తోంది....మొత్తానికి ఒక నిండు అమాయక ప్రాణం బలి అయ్యింది
By Anonymous on 08-06-2016